- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోరం.. పెళ్లి చేసుకోవాలని కోరిందని ప్రియురాలి ప్రైవేట్ పార్ట్‌పై నిప్పింటించిన ప్రియుడు
హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. ప్రియురాలి ప్రైవేట్ పార్ట్స్ పై శానిటైజర్ పోసి ప్రియుడు నిప్పంటించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, వెబ్ డెస్క్: హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. ప్రియురాలి ప్రైవేట్ పార్ట్స్ పై శానిటైజర్ పోసి ప్రియుడు నిప్పంటించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..త్రిపురకు చెందిన (19)ఏళ్ల యువతి, ఢిల్లీకి చెందిన శివమ్ (19)తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది. వీరిద్దరూ గురుగ్రామ్‌లోనే కలిసి నివసిస్తుండగా డేటింగ్ యాప్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది. కాగా ప్రియుడు తనను చిత్రహింసలకు గురి చేయడంతో ప్రియురాలు ఈ నెల 19న తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరింది. తీవ్రగాయాలపాలైన యువతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను పేర్కొంది.
శివమ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లివ్ ఇన్ రిలేషన్ షిప్ ఉన్నాడని చెప్పింది. ఈ క్రమంలో తాను పెళ్లి గురించి అడగటంతోనే దాడికి పాల్పడ్డాడని తెలిపింది. మూడు రోజులుగా తనపై చిత్రహింసలకు పాల్పడ్డాడని చెప్పింది. మెడల్ బాటిల్ తో తలపై దాడి చేయడంతో పాటు ఇంటి ఫర్నిచర్ పూర్తిగా పగలగొట్టాడని తెలిపింది. తనపై కత్తితో సైతం దాడి చేసి శానిటైజర్ పోసి ప్రైవట్ పార్ట్స్ పై నిప్పంటించినట్టు చెప్పింది. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.






