లక్షలు ఖర్చు చేశా, నన్ను వాడుకుంది.. ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య

by Ajay Maddhiboyina |

ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏర్గట్ల మండలానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు అఖిల అనే అమ్మాయిని ప్రేమించాడు. ఈ నెల7వ తేదీన ప్రేమించిన యువతి పెళ్లి కావడంతో తీవ్రమనస్థాపం చెంది 6వ తారీఖున పురుగుల మందు తాగాడు.

లక్షలు ఖర్చు చేశా, నన్ను వాడుకుంది.. ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏర్గట్ల మండలానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు అఖిల అనే అమ్మాయిని ప్రేమించాడు. ఈ నెల7వ తేదీన ప్రేమించిన యువతి పెళ్లి కావడంతో తీవ్రమనస్థాపం చెంది 6వ తారీఖున పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ శ్రీకాంత్ గురువారం మరణించగా తనను మోసం చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్టు మరణవాంగ్మూలంలో తెలిపాడు. తాను లండన్ లో ఉన్నప్పుడు అఖిలకు చాలా ఖరీదైన బహుమతులు ఇచ్చేవాడిని అని చెప్పాడు.

రూ.50వేల విలువ చేసే గిఫ్టులు ఇచ్చానని అన్నాడు. అంతే కాకుండా రూ.6 లక్షల వరకు డబ్బులు కూడా ఇచ్చినట్టు చెప్పాడు. తనను వాడుకుని వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లి చేసుకుందామని తనకు మాట ఇచ్చిందని, పెళ్లికి ఒకరోజు ముందు కూడా నీతో బయటకు వస్తానని చెప్పిందన్నాడు. కానీ ఆ తరవాత అసలు తన కాల్స్ కు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను లండన్ లో మంచిగా స్థిరపడిన సమయంలో పెళ్లి చేసుకుందామని ఇండియాకు రప్పించిందన్నాడు. వచ్చిన తరవాత తనకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని నేనేం చేయాలి అంటూ హ్యాండ్ ఇచ్చిందన్నాడు. తనను చాలా వాడుకుందని, ఈ పరిస్థితికి కారణం అఖిలనే అని చెప్పారు. శ్రీకాంత్ మృతితో గ్రామంలో ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. శ్రీకాంత్ డెడ్ బాడీతో గ్రామంలో శ‌వ‌యాత్ర నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో పోలీసులు అడ్డుకోవ‌డంతో శ్రీకాంత్ కుటుంబ స‌భ్యులు పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. ప‌రిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకువ‌చ్చారు. అఖిల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ్రామ‌స్థులు, కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story