- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. చెరువులో పడి బాలుడు మృతి
by Bhanu |
దిలావర్‌పూర్ మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెరువులో పడి 15 ఏళ్ల బాలుడు అశ్విత్ మృతి చెందాడు.

X
దిశ, దిలావర్పూర్: దిలావర్‌పూర్ మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెరువులో పడి 15 ఏళ్ల బాలుడు అశ్విత్ మృతి చెందాడు. మృతుడి తల్లి కొప్పుల పద్మ తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అశ్విత్ ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. కానీ రాత్రి ఏడు గంటలవరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వేటాడినా ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈరోజు కూడా వెతకగా, చెరువు దగ్గర వ్యవసాయ పనులకై వెళ్లిన రైతు ఒక్క శవాన్ని గమనించి కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అశ్విత్ కాలు జారి చెరువులో పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రతిరోజూ అతను కాలకృత్యాల కోసం చెరువుకు వెళ్లేవాడని స్థానికులు తెలిపారు.
Next Story






