విద్యుత్ షాక్ తో బాలుడి మృతి

by Ratna Kumari |

విద్యుత్ షాక్ తో బాలుడు మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని వెలుగొండ గ్రామంలో చోటు చేసుకుంది.

విద్యుత్ షాక్  తో బాలుడి మృతి
X

దిశ, బిజినేపల్లి : విద్యుత్ షాక్ తో బాలుడు మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని వెలుగొండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వెలుగొండ గ్రామంలో నూత‌నంగా ఇల్లు నిర్మిస్తుండ‌టంతో విద్యుత్ షాక్ త‌గిలి ఉపేంద‌ర్ (15) అనే బాలుడు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. గోడ‌ల‌కు నీటిని ప‌డుతుండ‌గా నీటి పైపు ఊడిపోయింది. దానిని స‌రి చేసే ప్ర‌య‌త్నంలో ప్ర‌మాద‌వ‌శాత్తు క‌రెంట్ షాక్ గురైన బాలుడు మృతి చెందిన‌ట్టు స్థానికులు తెలిపారు. ఇప్ప‌టికే ఆ బాలుడి తండ్రి మృతి చెంద‌డ‌తో ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు తాజాగా మ‌ర‌ణించ‌డంతో త‌ల్లి, త‌మ్ముడు శోక‌సంద్రంలో మునిగిపోయారు. అది చూసిన వారు కూడా కంట పెట్ట‌కుండా ఉండ‌లేక‌పోయారు.

Next Story