చికిత్స పొందుతూ బాలుడి మృతి

by Disha Web |
చికిత్స పొందుతూ బాలుడి మృతి
X

దిశ, కుల్కచర్ల : చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన సంఘటన కుల్కచర్ల మండలం ఘనపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుల్కచర్ల మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన వార్ల సతీష్(14) గత నాలుగు నెలల నుండి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చూపించినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 11న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కుల్కచర్ల, పరిగిలో ఉన్న ఆసుపత్రులలో చూపించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed