- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు.. ఫ్లైట్‌లో RDX పెట్టినట్లుగా ఈ-మెయిల్
సౌదీ అరేబియా (Saudi Arabi)కు చెందిన ఎయిర్‌బోర్న్ ఫ్లైనాస్ ఎయిర్‌లైన్స్ (Airborne Flynas Airlines) విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియా (Saudi Arabia)కు చెందిన ఎయిర్‌బోర్న్ ఫ్లైనాస్ ఎయిర్‌లైన్స్ (Airborne Flynas Airlines) విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేపింది. విమానంలో 5 ఆర్‌డీఎక్స్ (RDX) బాంబులు అమర్చినట్లుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై విమానాన్ని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత సీఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు మెయిల్ ఎవరు పంపారనే దానిపై సైబర్ నిపుణులు ఆరా తీస్తున్నారు.






