- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ రాజధానిలో బాంబు బెదిరింపు కలకలం.. రంగంలోకి దిగిన పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ద్వారక ప్రాతంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఓ ఆగంతకుడి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు వారు ఫైర్ సిబ్బంది, బాంబు, డాగ్ స్క్వాడ్‌తో స్పాట్‌కు చేరుకున్నారు. ముందుగా స్కూల్‌లోని స్టాఫ్‌ను బయటకు పంపి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. భద్రత దృష్ట్యా పాఠశాలకు వస్తున్న విద్యార్థులను సిబ్బంది తిరిగి ఇంటికి పంపించేస్తున్నారు.
కాగా, జూలై 18న, జాతీయ రాజధానిలో 20కి పైగా పాఠశాలలు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చి విషయం తెలిసిందే. అందులో రోహిణి సెక్టార్-3 పరిధిలోని అభినవ్ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని రిచ్‌మండ్ గ్లోబల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు బాంబు స్క్వాడ్‌తో పాటు, ఫైర్ డిపార్ట్‌మెంట్ బృందాలు హుటాహుటిన స్పాట్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఆ తరువాత ఎక్కడా కూడా బాంబులు లేవని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






