బొలెరో-కారు ఢీ.. ఒక‌రు మృతి

by Nallavelli.Anjaneyulu |

బొలెరో-కారు ఢీ కొన‌డంతో ఓ వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా వెల్దండ మండ‌ల ప‌రిధిలో మంగ‌ళ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది.

బొలెరో-కారు ఢీ.. ఒక‌రు మృతి
X

దిశ‌, వెల్దండ : బొలెరో-కారు ఢీ కొన‌డంతో ఓ వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా వెల్దండ మండ‌ల ప‌రిధిలో మంగ‌ళ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండల పరిధిలోని హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి పై రాఘాయిపల్లి గేటు సమీపంలో కల్వకుర్తి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం, హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కల్వకుర్తి చెందిన తలసాని గిరిధర్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు.

Next Story