- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీక్యాతండాలో గుర్తుతెలియని మృతదేహం కలకలం
మిర్యాలగూడ రూరల్ పరిధిలోని టీక్యాతండా గ్రామ శివారులో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

దిశ, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ రూరల్ పరిధిలోని టీక్యాతండా గ్రామ శివారులో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న డాక్టర్ ధరావత్ జగేందర్ వ్యవసాయ భూమిలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, మృతుడి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, ఉదయం నుండి మధ్యాహ్నం మధ్యలో మరణం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడు బూడిద రంగు ప్యాంట్ ధరించి ఉండగా, నాచు రంగు ఫుల్ హ్యాండ్ చొక్కాపై తెలుపు మరియు నీలం రంగుల చెక్ డిజైన్ ఉన్నది. అలాగే అతని చేతికి ఎరుపు దారం కట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే వెంటనే CI, మిర్యాలగూడ రూరల్ – 8712670151, SI, మిర్యాలగూడ రూరల్ – 8712670189 నంబర్లను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.






