షాబాద్ ఘటనలో గ్రామానికి చేరుకున్న బాలిక, కుటుంబ సభ్యుల మృతదేహాలు

by Taduka Kalyani |

హత్య చేయబడిన మైనర్ బాలిక, లక్ష్మమ్మ, రుక్కమ్మ మృతదేహాలను షాబాద్ గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ చెత్త బండి ట్రాక్టర్ లో వేసి తరలించాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

షాబాద్ ఘటనలో గ్రామానికి చేరుకున్న బాలిక, కుటుంబ సభ్యుల మృతదేహాలు
X

దిశ, షాబాద్: హత్య చేయబడిన మైనర్ బాలిక, లక్ష్మమ్మ, రుక్కమ్మ మృతదేహాలను షాబాద్ గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ చెత్త బండి ట్రాక్టర్ లో వేసి తరలించాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు, కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం అందించకుండా మృతదేహాలను తరలించాడని, పోస్టుమార్టం చేసిన మృతదేహాలను అంబులెన్స్ లో నుండి క్రిందకు దించకుండా ఆందోళన చేశారు. విషాద సమయంలో హత్య చేయబడిన మృతదేహాలను అంబులెన్స్ లో, ప్రత్యేక వాహనంలో ఆసుపత్రికి తరలించాల్సింది పోయి చెత్త బండి ట్రాక్టర్లో తరలించడం ఏంటని కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. గ్రామ సర్పంచ్ అశోక్ పై చర్యలు తీసుకునేంత వరకు మృతదేహాలను సమాధి చేయమని పోలీసులకు తెలిపారు. సర్పంచ్ పై మీరు ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.

Next Story