ఇంటికొచ్చిన ముగ్గురు అక్కాచెల్లెల మృతదేహాలు.. శోకసంద్రంలో గ్రామం

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-03 10:31:52  IST  )

రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా చేవెళ్ల(Chevella)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇప్పటి వరకు 21 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

ఇంటికొచ్చిన ముగ్గురు అక్కాచెల్లెల మృతదేహాలు.. శోకసంద్రంలో గ్రామం
X

దిశ; వెబ్‌డెస్క్: రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా చేవెళ్ల(Chevella)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇప్పటి వరకు 21 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురు మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు వెల్లడించారు. అయితే.. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెల్లు మృతిచెందడం కలకలం రేపుతోంది. తాజాగా పోస్టుమార్టం అనంతరం తనూష, సాయి ప్రియా, నందిని మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి. దీంతో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం పెర్కంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగారు.

హతవిధీ..! చావులోనూ ఒక్కటై: బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుర్మరణం

Next Story