దేశంలో మ‌రో బ్లూడ్ర‌మ్ హ‌త్య క‌ల‌క‌లం.. అనుమానాస్పదస్థితిలో యువతి డెడ్ బాడీ

by Ajay Maddhiboyina |

దేశంలో బ్లూడ్రమ్ హత్య అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లో ప్రియుడితో అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను హత్య చేసి డ్రమ్ లో పెట్టింది. అనంతరం తన ప్రియుడితో కలిసి పారిపోయింది.

దేశంలో మ‌రో బ్లూడ్ర‌మ్ హ‌త్య క‌ల‌క‌లం.. అనుమానాస్పదస్థితిలో యువతి డెడ్ బాడీ
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో బ్లూడ్రమ్ హత్య అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లో ప్రియుడితో అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను హత్య చేసి డ్రమ్ లో పెట్టింది. అనంతరం తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన తరవాత దేశవ్యాప్తంగా భార్యలు భర్తలను వేధించడం, హత్య చేయడంపై చర్చజరిగింది. అయితే ఇప్పుడు దేశంలో మరోసారి బ్లూడ్రమ్ మర్డర్ కలకలం రేపుతోంది. అయితే ఇక్కడ ఓ యవతిని దారుణంగా హతమార్చి డ్రమ్ లో కుక్కేశారు. ఈ ఘటన పంజాబ్ లోని పటియాలాలో చోటు చేసుకుంది.

పటియాలాలోని అర్బన్ ఎస్టేట్ ప్రాంతంలో ఒకనీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్కులో బుధవారం యువతి డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. అయితే డ్రమ్ము రోడ్డు పక్కన పడేసి ఉండటంతో ఈకేసు మిస్టరీగా మారింది. స్థానికుల స‌మాచారంతో ఘ‌ట‌నాస్థ‌లానికి చేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు. మృతురాలి వ‌య‌సు 15 నుండి 20 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అంతేకాకుండా యువ‌తి చేతిపై నేహా అనే ప‌చ్చ‌బొట్టు ఉండ‌గా, మ‌రో చేతిపై హార్డ్ సింబ‌ల్ ఉంది. దీంతో మృతురాలిని గుర్తించేందుకు ప‌చ్చ‌బొట్లు కీల‌కంగా మార‌తాయ‌ని భావిస్తున్నారు. మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు.

Next Story