- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టిప్పర్ ఢీ కొని బైకు మైకానిక్ దుర్మరణం
by Ratna Kumari |
దిశ, నల్లగొండ క్రైం: బైక్ పై వెళుతున్న యువకుడిని వెనుక నుంచి టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ

X
దిశ, నల్లగొండ క్రైం: బైక్ పై వెళుతున్న యువకుడిని వెనుక నుంచి టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో మంగళవారం జరిగింది. వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం, చలకుర్తి గ్రామానికి చెందిన బూరుగు సందీప్ కుమార్ (18), నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఎస్ఎల్బీసీలో ఉండే తన అక్క దగ్గర మధ్యాహ్న సమయంలో భోజనం చేసి దేవరకొండ రోడ్డు నుంచి బైక్ మెకానిక్ షాప్ కు వెళుతుండగా.. అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వచ్చిన టిప్పర్, వెనుక నుంచి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్ (సన్నీ) తల నుజ్జై అక్కడిక్కడే చనిపోయాడు. తండ్రి పూర్ణ చందర్ రావు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
Next Story






