- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, భైంసా : పట్టణంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఆర్టీసీ డిపో సమీపంలోని సాత్ఫుల్ బ్రిడ్జిపై లారీ, ద్విచక్ర వాహనం ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే... తానూర్ మండలం బెల్ తరోడ గ్రామానికి చెందిన సాయినాథ్ (37) రోల్డ్ గోల్డ్ ముత్యాల వ్యాపారిని. పని నిమిత్తం భైంసా పట్టణంలోని ఓ వాడలో కొంతకాలంగా నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన సమయంలో, భైంసా నుంచి ఓల్డ్ చెక్‌పోస్టు రోడ్డుకు వెళ్తున్న లారీ అతనికి ఢీకొంది. ఢీకొన్న దెబ్బకు సాయినాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అతనికి భార్య, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






