- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. వ్యక్తి స్పాట్ డెడ్
ఫంక్షన్ కు అటెండ్ అయ్యేందుకు ఒకరు బైక్ పై వెళ్తుండగా, హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొని ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలైన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది.

దిశ, భిక్కనూరు : ఫంక్షన్ కు అటెండ్ అయ్యేందుకు ఒకరు బైక్ పై వెళ్తుండగా, హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొని ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలైన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ... సదాశివనగర్ మండలం కల్వరాల గ్రామానికి చెందిన కోట్ల శ్రీనివాస్ (43) వ్యవసాయంతో పాటు, బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బీబీపేట మండల కేంద్రంలో బంధువులకు సంబంధించిన ఫంక్షన్ ఉండడంతో, ఆ ఫంక్షన్ ను అటెండ్ చేసేందుకు తన బైక్ పై బయలుదేరాడు. ఆర్టీఏ చెక్ పోస్ట్ దాటి కృష్ణ మందిర్ ఆలయ సమీపంలోకి రాగానే, హైవేపై ఆగి ఉన్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ వెనకాల టైలర్ కిందికి చొచ్చుకుపోగా, బైక్ నడుపుతున్న శ్రీనివాస్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతునికి భార్య రాజమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ మృతి చెందాడని తెలిసి ఇదే దారిలో వేరే ఊళ్లో ఫంక్షన్ కు అటెండ్ అయిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు భిక్కనూరు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, కేసు నమోదు చేసుకొని, డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు.






