ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

by Bhanu |   (  Updated:2025-06-25 15:08:31  IST  )

భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఎల్లేటి రామయ్యపల్లె శివారులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
X

దిశ, చిట్యాల: భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఎల్లేటి రామయ్యపల్లె శివారులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల నుంచి జమ్మికుంట వైపు వేగంగా ప్రయాణిస్తున్న డీసీఎం వ్యాన్, ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతుల్లో నవాబుపేట గ్రామానికి చెందిన ఎండి రహీం కుమారుడు అకీమ్ (17), కైలాపూర్‌కు చెందిన సకినాల రవి కుమారుడు కుమారస్వామి (20) ఉన్నారు. ఇద్దరూ చిట్యాల వస్తుండగా ఎల్లేటి రామయ్యపల్లె సమీపంలో ఈ విషాద ఘటన జరిగింది. డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో తలెత్తనంత ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story