ప్రాణం తీసిన అతివేగం.. షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

అతివేగం ప్రాణాలు తీస్తుంద‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. రోడ్డ ప‌క్క‌న సైతం స్పీడ్ లిమిట్ బోర్డుల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రాణం తీసిన అతివేగం.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: అతివేగం ప్రాణాలు తీస్తుంద‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. రోడ్డ ప‌క్క‌న సైతం స్పీడ్ లిమిట్ బోర్డుల‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొంత‌మంది మాత్రం మార‌డంలేదు. థ్రిల్ కోసం అతివేగంగా బైక్ న‌డుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఖ‌మ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అతివేగం ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. కల్లూరు మండలం గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై మహేశ్(35), గ‌ట్టు రాంబాబు (39) అనే యువ‌కులు హై స్పీడ్ తో రెయిలింగ్ ను ఢీ కొట్టారు. దీంతో తీవ్ర‌గాయాల పాలై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియోలో యువ‌కులు అతివేగం కార‌ణంగానే బైక్ అదుపుత‌ప్పి రీలింగ్ ను ఢీ కొట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. వీడియోను చూసిన నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. ఎదురుగా ఎలాంటి వాహ‌నాలు రాక‌పోయినా యువ‌కులు త‌మ డ్రైవింగ్ కార‌ణంగానే ప్రాణాలు కోల్పాయ‌ర‌ని కామెంట్ చేస్తున్నారు.

Next Story