- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మగాళ్ల కోరికే ఆయుధం.. ప్రెగ్నెంట్‌ను చేస్తే రూ.10 లక్షలు
ఆకర్షణీయంగా కనిపించే అమ్మాయిల ఫొటోలను చూపించి ఆన్లైన్లో ప్రకటనలు చేశారు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నామని, ఏ రాష్ట్రానికి చెందినవారికైనా ఉద్యోగం ఇస్తామని చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: మోసపోయేవాళ్లు ఉన్నంతవరకూ మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈజీ మనీ కోసం కొంతకాలంగా రకరకాల మోసాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూశాయి. కానీ బిహార్ లో జరిగిన ఈ తరహా మోసం ఇప్పటి వరకూ కనీ వినీ ఉండరు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ స్కామ్ గా పిలుస్తోన్న ఈ మోసంలో.. మోసం చేసేవాళ్లు మగాళ్ల కోరికను టార్గెట్ చేశారు. వినడానికి కాస్త వింతగా ఉన్నా.. ఇది నయా సైబర్ స్కామ్. పిల్లలు లేని జంటలకు పిల్లలను పుట్టించడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పుకున్నారు. చాలాకాలంగా పిల్లల్లేని మహిళను గర్భవతిని చేస్తే.. రూ.10 లక్షలు, ఫెయిలైతే రూ.5 లక్షలు ఇస్తామని నమ్మించారు.
సక్సెస్ అయితే రూ.10 లక్షలు.. ఫెయిలైతే రూ.5 లక్షలు
ఆకర్షణీయంగా కనిపించే అమ్మాయిల ఫొటోలను చూపించి ఆన్లైన్లో ప్రకటనలు చేశారు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నామని, ఏ రాష్ట్రానికి చెందినవారికైనా ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఆ ప్రకటన చూసి నిజమేనని నమ్మి ఫోన్ చేసిన వారికి టోకరా వేశారు. ప్రెగ్నెంట్ ను చేయడంలో ఫెయిలైతే రూ.5 లక్షలు ఇస్తామని చెప్తారు. ప్రెగ్నెంట్ అయినా అవ్వకపోయినా సుఖపడతాం కదా అన్న ఉద్దేశ్యంతో కొందరు వారి వలలో చిక్కారు. అంతే.. రిజిస్ట్రేషన్ కు రూ.799 కట్టాలని, షార్ట్ లిస్ట్ అయ్యాక ఇన్ ఫాం చేస్తామంటారు. మళ్లీ కాల్ చేసి మీపేరు షార్ట్ లిస్ట్ అయింది.. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.5000 నుంచి రూ.25000 లోపు ఎంత కట్టాలో చెప్తారు. ఆ తర్వాత స్పెర్మ్ టెస్ట్, కోర్టు నుంచి NOC కోసం, దానికి జీఎస్టీ.. ఇలా చాలా పేర్లతో డబ్బులు గుంజుతారు. ఆ తర్వాత వారి ఫొటోలతో మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేసి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని లీక్ చేస్తామని బెదిరిస్తారు.
100కు పైగా బాధితులు.. రూ.50 లక్షల ఆదాయం
ఈ స్కామ్ లో చిక్కుకుని మోసపోయిన కొందరు పోలీసులను ఆశ్రయించగా.. నవాడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్వాడ గ్రామంలో సీక్రెట్ గా ఈ స్కామ్ ను నడుపుతున్న ప్రదేశంపై దాడులు చేసి ఓ మైనర్ సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో BNS 318 (4) చీటింగ్, 336 (3) ఫోర్జరీ, ఐటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ 100 మందికి పైగా వ్యక్తుల నుంచి రూ.50 లక్షలకు పైగా డబ్బులు దండుకునంటున్నట్లు గుర్తించారు. ఆ డబ్బులను UPI మ్యూల్ అకౌంట్లకు బదిలీ చేసినట్లు కనుగొన్నారు. క్రిప్టో, గేమింగ్ యాప్ ల ద్వారా ఈ డబ్బును వైట్ మనీగా మార్చినట్లు గుర్తించారు. చట్టబద్ధంగా ఏ ఉద్యోగానికి ముందస్తు రిజిస్ట్రేషన్ ఉండదని ఎస్పీ ధీమాన్ తెలిపారు. https://emigrate.gov.in/#/emigrate ద్వారా ఉద్యోగాలను చెక్ చేసుకోవాలని సూచించారు. ఏదైనా ఫ్రాడ్ అని తెలిస్తే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేసి చెప్పాలని సూచించారు.






