- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో పెద్ద ఉగ్రవాది అరెస్ట్.. ఇంట్లో భారీగా ఆయుధాలు
హైదరాబాద్‌లో పెద్ద ఉగ్రవాదిని గుజరాత్ పోలీసులు(Gujarat Police) అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో పెద్ద ఉగ్రవాదిని గుజరాత్ పోలీసులు(Gujarat Police) అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భగ్నం చేసింది. ఈ మేరకు ఆదివారం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. వారికి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ (ISIS)తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్(35) ఉన్నారు. ఇతను తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని దీని ఆధారంగా, ఆదివారం ఆయన నివాసంలో విస్తృతంగా అధికారులు తనిఖీలు చేశారు. టెలీగ్రామ్ ద్వారా ఐఎస్‌కేపీ సభ్యులతో మొహియుద్దీన్ చర్చలు జరుపుతున్నాడని నిర్ధారించారు. నిందితుడి నుంచి రెండు గ్లాక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. ఈనెల 18 వరకు రిమాండ్ విధించింది. కాగా, మొహియుద్దీన్ ఫ్రాన్స్‌లో MBBS పూర్తి చేసినట్లు గుర్తించారు. విచారణలో మొహియుద్దీన్ ఆయుధాలను రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ నుండి కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. దర్యాప్తులో కేంద్ర సంస్థలు కూడా పాల్గొన్నాయి.






