యువరాజ్ సింగ్, సోనూసూద్, నేహా శర్మకు BIG షాక్

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-19 11:53:19  IST  )

యువరాజ్ సింగ్, సోనూసూద్, నేహా శర్మకు BIG షాక్

యువరాజ్ సింగ్, సోనూసూద్, నేహా శర్మకు BIG షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ కేసు(Betting Apps Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పలువురు ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆస్తులను అటాచ్ చేశారు. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటులు సోనూసూద్, నేహాశర్మ, ఊర్వశీ రౌటెలా, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, బెంగాళీ నటుడు అంకుశ్ హజ్రా ఆస్తులను అటాచ్ చేస్తూ శుక్రవారం ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అటాచ్ చేసిన రూ.7.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.19.7 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. కాగా, బెట్టింగ్ యాప్‌ల బారిన పడి పలువురు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ప్రముఖులను అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులను కూడా సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. వీరిపై మియాపూర్, పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి.

Next Story