త్రుటిలో తప్పిన పెనుప్రమాదం..

by Sumithra |   ( Updated:2024-10-21 09:48:49.0  )
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం..
X

దిశ, తంగళ్ళపల్లి : తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులో ప్రధాన రహదారి పై మూల మలుపు వద్ద త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. సోమవారం మూల మలుపు వద్ద వేగంగా వెళ్తున్న బొలెరో, అటువైపు నుంచి సిరిసిల్లకు వస్తున్న బెలోనో కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బోలేరో వాహనం బోల్తా పడగా, కారు రోడ్డు పక్కకు దూసుకు పోయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed