- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడి మోజులో.. రెండు నెలల క్రితం భర్తను, ఇప్పుడు బంగారం లాంటి కూతురుని!
జయశంకర్ భూపాలపల్లిలో హత్యకు గురైన వర్షిణి (22) హత్య కేసు మిస్టరీ వీడింది. కొద్దిరోజుల క్రితం భూపాలపల్లి- కాటారం హైవే పక్కన అడవిలో వర్షిణి డెడ్ బాడీని వాహనదారులు గమణించి పోలీసులకు సమాచారం అందించారు.

దిశ, వెబ్ డెస్క్: జయశంకర్ భూపాలపల్లిలో హత్యకు గురైన వర్షిణి (22) హత్య కేసు మిస్టరీ వీడింది. కొద్దిరోజుల క్రితం భూపాలపల్లి- కాటారం హైవే పక్కన అడవిలో వర్షిణి డెడ్ బాడీని వాహనదారులు గమణించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద నిమ్మకాయలు, పసుపు కుంకుమ ఉండటంతో నరబలి అని అనుమానించారు. అక్కడ దొరికిన ఆధార్ కార్డ్ ఆధారంగా చనిపోయిన యువతి జిల్లాలోని చిట్యాల మండలం వడితల గ్రామానికి చెందిన వర్షిణిగా గుర్తించారు. అయితే ఈ కేసు విచారణ సమయంలో పలు అనుమానాలు రాగా చివరికి సవితి తల్లే దారుణానికి పాల్పడినట్టు తేలింది.
అంతేకాకుండా మరికొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. ప్రియుడి మోజులో వర్షిణిని ఆమె సవితి తల్లి కవిత హత్య చేసినట్టు పోలీసులు నిర్దారించారు. ప్రియుడితో కలిసి కూతురును హత్య చేసినట్టు గుర్తించారు. అంతే కాకుండా గతంలో కవిత తన భర్తను హత్య చేసి అనారోగ్యంతో చనిపోయినట్టు అందరినీ నమ్మించినట్టు పోలీసుల విచారణలో తేలింది. కవితకు గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉండగా పక్షవాతంతో బాధపడుతున్న తన భర్తకు విషయం తెలిసిందని జూన్ 25న అతడిని హత్య చేసింది.
అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడని అందరినీ నమ్మించి తప్పించుకుంది. ఇక ఆమె వివాహేతర సంబంధం గురించి కూతురుకు సైతం తెలియడంతో అతడు ఇంటికి ఎందుకు వస్తున్నాడని వర్షిణి పలుమార్లు వాదించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కూతురును సైతం అడ్డుతొలగించుకుంటే ప్రియుడితో ఎంజాయ్ చేయవచ్చని భావించింది. కూతురును చంపిన తరవాత మరో హత్యకు కవిత ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే కథ అడ్డం తిరగటంతో కిల్లర్ లేడీ అడ్డంగా బుక్ అయ్యింది. విచారణలో నిజాలు ఒప్పుకోవడంతో కవితను ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.






