- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ పిల్లలను కిడ్నాప్ చేసామంటూ వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త!
ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్లు(Cybercrimes) ప్రజలను పట్టి పీడిస్తున్నారు. సాంకేతికతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్లు(Cybercrimes) ప్రజలను పట్టి పీడిస్తున్నారు. సాంకేతికతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల సైబర్మోసాలు గణనీయంగా పెరిగాయి. ఫోన్ కాల్స్(Threatening Phone Calls) చేయడం, ఆఫర్లు ఉన్నాయంటూ మెసేజెస్ చేయడం, ఫోన్ చేసి పిల్లల ఏడుపు వినిపించి కిడ్నాప్ చేశామంటూ భయందోళనకు గురిచేయడం.. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమ్తత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్(CP Sajjanar) హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
‘‘మీ పిల్లలను కిడ్నాప్ చేసామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త ఉండాలి. పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడకండి. అత్యాశ, భయం.. ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్నాయి. ఈ నేరాలకు చెక్ పెట్టాలంటే అవగాహనతో కూడిన అప్రమత్త అవసరం. మీ పిల్లలు, బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో పంచుకోకండి. ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి’’ అని సజ్జనార్ పేర్కొన్నారు. ట్వీట్






