- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Betting App Case: ముగిసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ విచారణ
Betting App Case: ముగిసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ విచారణ

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్(Betting App Case) ప్రమోషన్ చేసిన కేసులో సీఐడీ(CID) దూకుడు పెంచింది. యాప్‌లను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్యుయెన్సర్లు, నటులు, ప్రముఖులను విచారిస్తోంది. తాజాగా ఇవాళ బిగ్‌బాస్ కంటెస్టెంట్ రీతు చౌదరి(Ritu Chowdhury), మంచు లక్ష్మి(Manchu Lakshmi), భయ్యా సన్నీ యాదవ్‌లను సీఐడీ అధికారులు విచారించారు. రెండు గంటలకు పైగా వీరిని ప్రశ్నించారు. స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. మరోవైపు.. ఇదే కేసులో ఇప్పటికే హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal), యాంకర్ శ్రీముఖి, నటి అమృత చౌదరి కూడా సీఐడీ అధికారుల విచారణకు గతంలో హాజరై వివరణ ఇచ్చారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం జరిగిన లావాదేవీలపై గతంలోనే వీరిని అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో బెట్టింగ్ యాప్స్‌కు ఎందుకు ప్రమోట్ చేశారు?. అందుకు ఎంతెంత తీసుకున్నారు?. యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలపై వీరి నుంచి అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. కాగా, ఈ కేసులో మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.






