- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేకలు వేస్తే ఇంకా ఎక్కువ మంది మగాళ్లు వస్తారు.. సంచలన నిజాలు బయటపెట్టిన బెంగాల్ గ్యాంగ్ రేప్ బాధితురాలు
పశ్చిమబెంగాల్‌లో యువ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పోలీసుల విచారణలో సంచలన విషయాలను బయటపెట్టింది.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్‌లో యువ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పోలీసుల విచారణలో సంచలన విషయాలను బయటపెట్టింది. తన స్నేహితుడితో డిన్నర్‌కు వెళ్లిన సమయంలో కొంతమంది వ్యక్తులు తమను వెంబడించినట్టు తెలిపింది. తమ కారుకు అడ్డంగా వచ్చి తమను బయటకు లాక్కెళ్లినట్టు పేర్కొంది.
తాము అడవిలోకి పారిపోవడంతో వెంటపడ్డారని తనను వెనక నుండి పట్టుకున్నారని చెప్పింది. తన మిత్రుడు పారిపోగా అతడికి ఫోన్ చేయాలని చెప్పారని అతడు తిరిగిరాకపోయేసరికి తనను బలవంతంగా కింద పడుకోబెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. కేకలు వేస్తే మరికొంత మంది మగాళ్లు వచ్చి మాలాగే చేస్తారని బెదిరించారని చెప్పింది. ఇదిలా ఉంటే బాధితురాలు ఒడిశాలోని జలేశ్వర్ కు చెందిన 23ఏళ్ల యువతి కాగా పశ్చిమబెంగాల్ లోని దుర్గాపూర్‌లోని ప్రైవేటు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తోంది.
శుక్రవారం రాత్రి ఆమె కాలేజీ క్యాంపస్ నుండి బయటకు వచ్చి డిన్నర్‌కు వెళుతుండగా ఐదుగురు వెంబడించి దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణానికి పాల్పడిన నింధితులను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వారిలో అదే కాలేజీలో సెక్యురిటీ గార్డుగా చేసే ఓ వ్యక్తి ఉన్నాడు. అంతే కాకుండా గ్యాంగ్ లో మరొకరు ఆస్పత్రిలో పనిచేస్తారు, ఇంకొకడు స్థానిక సంస్థలో కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేస్తున్నాడు. ఇక మరొకడు జులాయిగా తిరిగే వ్యక్తి. ప్రస్తుతం నింధితులు పోలీసుల అదుపులో ఉండగా వారిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.






