బెల్టు దుకాణాలపై పోలీసుల ఆకస్మిక దాడి.. 14 లీటర్ల మద్యం సీజ్

by Bhanu |

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని స్వాములవారి లింగోటం, లింగోజీగూడెం గ్రామాల్లోని మద్యం బెల్టు దుకాణాలపై సోమవారం రాత్రి చౌటుప్పల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

బెల్టు దుకాణాలపై పోలీసుల ఆకస్మిక దాడి.. 14 లీటర్ల మద్యం సీజ్
X

దిశ, చౌటుప్పల్ టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని స్వాములవారి లింగోటం, లింగోజీగూడెం గ్రామాల్లోని మద్యం బెల్టు దుకాణాలపై సోమవారం రాత్రి చౌటుప్పల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధకుమార్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాల్లో దుకాణాల తనిఖీల్లో భాగంగా ఈ దాడులు చేపట్టారు. అక్రమంగా మద్యం అముతూ మండలంలోని స్వాముల వారి లింగోటం గ్రామానికి చెందిన తూర్పునూరి సువర్ణ పోలీసులకు చిక్కింది.

ఆమె ఇంట్లో సోదా చేయగా 180 ఎం. ఎల్ మద్యం బాటిళ్లు 41 లభ్యమాయ్యాయి. అదేవిధంగా లింగోజీగూడెం గ్రామానికి చెందిన వల్లందాసు యాదమ్మ వద్ద , కేకే 180 ఎం. ఎల్ -36 బాటిళ్లు, ఓసీ 180ఎం. ఎల్ 01, 90 ఎంఎల్ -01మొత్తం 14.130 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై సదరు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ తెలిపారు.

Next Story