Bengaluru Road Accident: ప్రాణం తీసిన తొందరపాటు.. ఒక్క క్షణం ఆగితే యోగీశ్వరి బతికేదేమో!

by Ajay Maddhiboyina |

బెంగుళూరులోని రాజ్ కుమార్ రోడ్డుపై రోడ్డు దాటుతుండ‌గా 27ఏళ్ల యోగేశ్వ‌రి అనే బ్యాంక్ ఉద్యోగినిని బైక్ ఢీకొట్టింది. మ‌ధ్యాహ్నం 12.30 నిమిషాల‌కు ఈ ప్ర‌మాదం జ‌ర‌గ్గా సీసీ టీవీ ఫుటేజీ షాకింగ్ గా మారింది.

Bengaluru Road Accident: ప్రాణం తీసిన తొందరపాటు.. ఒక్క క్షణం ఆగితే యోగీశ్వరి బతికేదేమో!
X

దిశ, వెబ్ డెస్క్: తొంద‌ర‌పాటు ఓ మ‌హిళ ప్రాణం తీసింది. బెంగుళూరులోని రాజ్ కుమార్ రోడ్డుపై రోడ్డు దాటుతుండ‌గా 27ఏళ్ల యోగేశ్వ‌రి అనే బ్యాంక్ ఉద్యోగినిని బైక్ ఢీకొట్టింది. మ‌ధ్యాహ్నం 12.30 నిమిషాల‌కు ఈ ప్ర‌మాదం జ‌ర‌గ్గా సీసీ టీవీ ఫుటేజీ షాకింగ్ గా మారింది. మ‌హిళ త‌న తోటి ఉద్యోగుల‌తో క‌లిసి లంచ్ కు వెళుతుండ‌గా రోడ్డు దాటుతూ వాహ‌నాలను స‌రిగ్గా చూడ‌కుండా ప‌రిగెత్తింది. ఈ క్ర‌మంలో వేగంగా వ‌చ్చిన బైక్ ఆమెను ఢీకొట్ట‌గా గాల్లోకి ఎగిరి కింద‌ప‌డింది. తీవ్ర‌గాయాలు కావ‌డంతో స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ క‌న్నుమూసింది.

బైక్ న‌డిపిన దీప‌న్ అనే యువ‌కుడికి సైతం గాయాలు కాగా ప్ర‌స్తుతం అత‌డు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న రాజాజిన‌గ‌ర్ ట్రాఫిక్ పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో రోడ్డుపై ప‌రిగెత్త‌డం మ‌హిళ త‌ప్పేన‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రు రోడ్డుపై జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇలాంటి ప్రమాదాలు త‌ర‌చూ జ‌రుగుతున్నాయ‌ని కామెంట్ చేస్తున్నారు.

Next Story