బెంగుళూరులో దారుణం.. అనారోగ్యాన్ని దాచి పెళ్లి చేసుకుందని భార్యను హత్య చేసిన డాక్టర్!

by Ajay Maddhiboyina |

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలు దాచిపెట్టి పెళ్లి చేసుకుందని భర్త చికిత్స పేరుతో భార్యను హత్య చేయ‌గా ఆరు నెల‌ల త‌ర‌వాత అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే.. బెంగుళూరులోని మున్నెకొల్లాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న డాక్ట‌ర్ కృతికా రెడ్డి, డాక్ట‌ర్ మ‌హేంద‌ర్ రెడ్డి భార్య భ‌ర్త‌లు.

బెంగుళూరులో దారుణం.. అనారోగ్యాన్ని దాచి పెళ్లి చేసుకుందని భార్యను హత్య చేసిన డాక్టర్!
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలు దాచిపెట్టి పెళ్లి చేసుకుందని భర్త చికిత్స పేరుతో భార్యను హత్య చేయ‌గా ఆరు నెల‌ల త‌ర‌వాత అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే.. బెంగుళూరులోని మున్నెకొల్లాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న డాక్ట‌ర్ కృతికా రెడ్డి, డాక్ట‌ర్ మ‌హేంద‌ర్ రెడ్డి భార్య భ‌ర్త‌లు. వీరికి గ‌తేడాది మే26న వివాహం జ‌ర‌గ్గా ఇద్ద‌రూ విక్టోరియా ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్లుగా ప‌నిచేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ లో కృతికా రెడ్డి అనారోగ్యానికి గుర‌వ్వ‌గా పుట్టింటికి వెళ్లింది. ఏప్రిల్ 21న ఆమె ఒక్క‌సారిగా స్పృహ త‌ప్పి ప‌డిపోగా అక్క‌డిక‌క్క‌డే క‌న్నుమూసింది.

దీంతో కూతురు కృతిక మ‌ర‌ణంపై కుటుంబ స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేశారు. కానీ అది స‌హ‌జ‌మ‌ర‌ణంలా అనిపించ‌డంతో పోలీసులు నార్మ‌ల్ డెత్ అని క‌న్ఫామ్ చేశారు. అయినప్ప‌టికీ కృతికా రెడ్డి సోద‌రి డాక్ట‌ర్ కావ‌డంతో సోద‌రి మృతిపై వివ‌ర‌ణాత్మ‌క ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని పోలీసుల‌ను కోరింది. దీంతో పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగించ‌గా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా కృతికారెడ్డికి అత్యంత శ‌క్తివంత‌మైన ప్రొపోఫోల్ మందును ఇచ్చిన‌ట్టు నిర్దారించారు.

కృతికారెడ్డి చ‌నిపోయే ముందు ఆమెకు వైద్యం చేస్తున్నానని చెప్పి భ‌ర్త‌నే ఇంజ‌క్ష‌న్స్ ఇవ్వ‌డంతో అత‌డిని పోలీసులు అక్టోబ‌ర్ 13న అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్య స‌మ‌స్య‌ను దాచిపెట్టి పెళ్లి చేసుకుంది అనే కార‌ణంతోనే కృతికారెడ్డిని భ‌ర్త హ‌త్య చేసిన‌ట్టు గుర్తించారు. అంతే కాకుండా మ‌హేంద‌ర్ రెడ్డి కుటుంబానికి క్రైమ్ బ్యాగ్రౌండ్ ఉన్న‌ట్టు గుర్తించారు. అతడి ఇద్ద‌రి సోద‌రుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్టు గుర్తించారు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మార‌గా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story