- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండ్లగూడ శిశువు మృతి కేసు.. కీలక ఆధారాలను సీజ్ చేసిన పోలీసులు
బండ్లగూడ శిశువు మృతి కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, చికిత్సకు వాడిన రెండు కీలక ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు పంపారు.

దిశ, వెబ్‌డెస్క్: బండ్లగూడ (Bandlaguda)లో కలకలం రేపిన శిశువు మృతి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. చికిత్సలో జరిగిన లోపాలపై ఆరా తీస్తున్న అధికారులు, సదరు ప్రైవేటు ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శిశువుకు అందించిన చికిత్స వివరాలను సేకరించిన పోలీసులు, ట్రీట్‌మెంట్ సమయంలో వాడిన రెండు ఇంజెక్షన్లను సీజ్ చేశారు. ఈ మందుల నాణ్యత, అవి మృతికి కారణమయ్యే అవకాశం ఉందా అనే కోణంలో పరిశీలించేందుకు వాటిని హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు. అదేవిధంగా శిశువుకు చికిత్స అందించిన సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది వివరాలను పోలీసులు సేకరించారు. వైద్యుల నిర్లక్ష్యం ఉందా.. లేదా అనర్హులైన వారెవరైనా చికిత్స అందించారా? అన్న కోణంలో సిబ్బందిని విచారించే అవకాశం ఉంది.
మార్చురీలోనే శిశువు మృతదేహం..
ప్రస్తుతం శిశువు మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) మార్చురీలో ఉంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో బండ్లగూడ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Tags
- Bandlaguda
- Infant Death Case
- Police Investigation
- Hyderabad Crime News
- Medical Negligence
- Injections Seized
- Health Department
- Osmania Hospital
- Post Mortem Report
- Hospital Staff Inquiry
- Private Hospital Probe
- Baby Death Mystery
- Medical Samples
- Hyderabad Police
- Infant Treatment Details
- Child Death Probe
- Medical Audit






