- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Madhya Pradesh: జబల్ పూర్ కలెక్టర్‌కు బండి సంజయ్ ఫోన్
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని జబల్ పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని జబల్ పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులంతా ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారానికి చెందినవారు కావడంతో విషయంతో తెలిసిన వెంటనే జబల్ పూర్ ఎస్పీ, కలెక్టర్(Jabalpur Collector)కు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన తీరుపై బండి సంజయ్ ఆరా తీశారు. మొత్తం 9 మంది ప్రమాదానికి గురి కాగా.. ఏడుగురు మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
మిగిలిన ఇద్దరిలో ఒకరు కోమాలోకి వెళ్లగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. కుంభమేళా(Maha Kumbh)కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైందని వెల్లడించారు. క్షతగాత్రులకు అన్ని రకాలుగా సాయం అందేలా చూడాలని బండి సంజయ్ అధికారులను బండి సంజయ్ కోరారు. వెంటనే పంచనామా పూర్తి చేసి మృతదేహాలను వారి కుటుంబ సభ్యలకు పంపేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. అనంతరం హైదరాబాద్‌లోని మృతుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మృత దేహాలను త్వరితగతిన హైదరాబాద్ పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
మంగళవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా (Kumbh Mela)కు వెళ్లిన తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. సిమెంట్ లోడ్‌తో వెళ్తోన్న లారీ హైవే పైకి రాంగ్ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం 14 మంది ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. క్షతగాత్రులను సిహోరా ఆసుపత్రికి తరలించారు.






