- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి భగీరథ్ పోక్సో కేసు.. రెండో రోజు విచారించనున్న పోలీసులు
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు బండి భగీరథ్‌ను కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిని కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను (Bandi Bhagirath) పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ విచారణ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. బాధితురాలైన బాలిక, ఆమె తల్లి పోలీసులకు ఇచ్చిన అధికారిక వాంగ్మూలం (Statement) ఆధారంగా నిందితుడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మొయినాబాద్ To గచ్చిబౌలి..
కోర్టు అనుమతితో భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. తొలి రోజు అతడిని మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌస్ (Aranya Farm House)కు తరలించి విచారించిన సంగతి తెలిసిందే. అక్కడ సీన్ రీ-కన్స్ట్రక్షన్ (Scene Reconstruction) పూర్తి చేసిన అధికారులు.. రెండో రోజు కస్టడీలో భాగంగా ఇవాళ గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు తీసుకువెళ్లి విచారించే అవకాశం ఉంది. నిందితుడు గతంలో సదరు బాలికను బెదిరించి పలు ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే క్రైమ్ సీన్ల వద్దకు నిందితుడిని నేరుగా తీసుకెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న అంశాలకు, నిందితుడు చెప్తున్న సమాధానాలకు ఎక్కడైనా పొంతన కుదురుతుందా లేదా అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ (DCP Rithiraj) స్వయంగా రంగంలోకి దిగి నిందితుడిని ప్రశ్నిస్తుండటంతో ఈ విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. లభించిన సాంకేతిక ఆధారాలు, డిజిటల్ డేటాతో పాటు అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం నిందితుడిని తిరిగి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.






