TG: బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్ సస్పెండ్.. మరో నలుగురు అధికారుల పాత్రపై దర్యాప్తు

by Gantepaka Srikanth |

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన(Kalthi Kallu Incident)ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ప్రారంభించింది.

TG: బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్ సస్పెండ్.. మరో నలుగురు అధికారుల పాత్రపై దర్యాప్తు
X

దిశ, వెబ్‌డెస్క్: కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన(Kalthi Kallu Incident)ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ప్రారంభించింది. శుక్రవారం బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్‌(Excise SHO Venukumar)ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల జారీ చేసింది. మరో నలుగురు అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తోంది. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడి హైదర్‌నగర్, హెచ్ఎంటీ కాలనీ, సర్దార్ పటేల్‌నగర్, భాగ్యనగర్ ప్రాంతాల్లో కల్లు కంపౌండ్ల నుంచి ఇప్పటికే శాంపిల్స్ సేకరించారు. పలు దుకాణాల్లో మత్తు మందుల కలయికతో కల్లు తయారీ జరిగినట్లు తేలింది. నివేదిక ఆధారంగా నలుగురు కల్లు వ్యాపారులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు. కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేశారు.

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ప్రస్తుతం నిమ్స్‌లో 31 మంది, గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

Next Story