ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే అని కుటుంబ సభ్యుల ఆరోపణ

by Chintha Aamani |

ఆదిలాబాద్ పట్టణంలోని తాంసీ బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సొనాల మండలానికి చెందిన ఓ గర్భిణీ మూడు రోజుల క్రితం చేరింది.

ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే అని కుటుంబ సభ్యుల ఆరోపణ
X

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని తాంసీ బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సొనాల మండలానికి చెందిన ఓ గర్భిణీ మూడు రోజుల క్రితం చేరింది. నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి ప్రసవం చేసే క్రమంలో శిశువు మృతి చెందినట్లు తెలిసింది.కాగా దీనిపై కుటుంబీకులు,బంధువులు ఆసుపత్రి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన బయటకు రాకుండా ఆస్పత్రి యాజమాన్యం కుటుంబీకులను ఒప్పించి కప్పి పుచ్చినట్లు సమాచారం. ఈ విషయమై డీఎంహెచ్ఓ ను వివరణ కోరగా.. ఈ ఘటనపై ఎవరు ఫిర్యాదు చేయలేదని సమాచారం అందలేదని తెలిపారు.

Next Story