రోగం తగ్గిస్తాడని పంపిస్తే బుట్టలో వేసుకున్న బాబా.. చివరికి సినిమా రేంజ్ ట్విస్ట్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-06 05:58:51  IST  )

రోగం తగ్గిస్తాడని పంపిస్తే యువతి తల్లి దండ్రులకు ఓ బాబా ఊహించని షాక్ ఇచ్చాడు. తరచూ ఇంటికి వస్తూ మాటలు కలిపి బుట్టలో వేసుకుని ఏకంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటు చేసుకుంది.

రోగం తగ్గిస్తాడని పంపిస్తే బుట్టలో వేసుకున్న బాబా.. చివరికి సినిమా రేంజ్ ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రోగం తగ్గిస్తాడని పంపిస్తే యువతి తల్లి దండ్రులకు ఓ బాబా ఊహించని షాక్ ఇచ్చాడు. తరచూ ఇంటికి వస్తూ మాటలు కలిపి బుట్టలో వేసుకుని ఏకంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటు చేసుకుంది. సాహెబ్ కుంటలో నివహించే ఓ యువతి అనారోగ్యానికి గురైంది. కూతురు అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఓ బాబాకు చూపించారు. ఆ బాబా కన్ను అమ్మాయిపై పడటంతో తరచూ ఇంటికి వస్తూ ఉండటం మొదలు పెట్టాడు. బాబా మంత్రిస్తే తమ కూతురి ఆరోగ్యం బాగుపడుతుందని భావించి తల్లిదండ్రులు కూడా నమ్మారు.

కానీ ఆ బాబా మాత్రం అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడు. దర్గాకు తీసుకెళ్లి మంత్రిస్తే పూర్తిగా కోలుకుంటుందని నమ్మించాడు. యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబా ఆ యువతిని పెళ్లి చేసుకున్నట్టు గుర్తించారు. అయితే తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, తాను మేజర్ అని యువతి చెప్పడంతో పోలీసులు కేసు క్లోజ్ చేశారు. మరోవైపు ఆ బాబాకు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం తెలిసి యువతి తల్లి దండ్రులు షాక్ అయ్యారు. తమ కూతురిని వెనక్కి తిరిగిరావాలని కోరుతున్నారు.

Next Story