- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉసురుతీసిన ఆర్థిక ఇబ్బందులు
by Sridhar Babu |
ఆర్థిక ఇబ్బందులు తాళలేక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది.

X
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని బీవైనగర్ కు చెందిన నేత కార్మికుడు ఆడెపు సంతోష్ (60) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నాలుగు నెలలుగా ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సంతోష్ కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా మృతుడి కూతురు డెలివరీ కోసం భార్య వారి ఇంటికి వెళ్లడంతో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
- Tags
- suicide
Next Story






