- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో బోల్తా.. వ్యక్తి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు
ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందడంతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని మసిగుండ్ల పల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది.

దిశ, మిడ్జిల్ : రోడ్డు మూలమలుపున ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడడంతో ఒకరు మృతి చెందడంతో పాటు ముగ్గురికి తీవ్రంగా గాయాలైన సంఘటన మండలంలోని మసిగుండ్ల పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం మసిగుండ్ల పల్లి నుండి మిడ్జిల్ కు వస్తున్న ఆటో లో రేకులు, బియ్యం సంచులు వేసుకొని ఓవర్ లోడ్ తో ప్రయాణికులతో మిడ్జిల్ కు వస్తుండగా.. కాటోనీ గడ్డ తండా రోడ్డు సమీపంలో మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడడంతో నరసయ్య , స్వప్న, దుబ్బ రాములు, పీర్లా నాయక్ కు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటన సమాచారంతో 108 సిబ్బంది హేమలత, గౌస్ ప్రథమ చికిత్స నిర్వహించి జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈదుల బాయి తండాకు చెందిన పీర్ల నాయక్ కు తీవ్ర గాయాలతో పాటు చేతి విరగడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసయ్య మృతి చెందారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన పాపకంటి నరసయ్య, పాపకంటి స్వప్న మసిగుండ్ల పల్లి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ రామచంద్రయ్య నిర్లక్ష్యం, అతివేగం కారణమే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.






