- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో సంచలనం.. మెడికల్ స్టూడెంట్‌పై ఆటో డ్రైవర్ అత్యాచారం
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ మధురలో దారుణం చోటు చేసుకుంది. మెడికల్ సీటు అడ్మిషన్ కోసం వచ్చిన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆటో డ్రైవర్. లక్నోకు చెందిన విద్యార్థిని ట్రైన్ ద్వారా మధురకు వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మధురలో దారుణం చోటు చేసుకుంది. మెడికల్ సీటు అడ్మిషన్ కోసం వచ్చిన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆటో డ్రైవర్. లక్నోకు చెందిన విద్యార్థిని ట్రైన్ ద్వారా మధురకు వచ్చింది. ఉదయాన్నే ట్రైన్ దిగిన ఆమె.. సిటీ గురించి తెలియకపోవడంతో.. కాలేజ్‌కు రీచ్ అయ్యేందుకు ఆటో తీసుకుంది. అయితే ఇదే అవకాశంగా భావించిన ఆటో డ్రైవర్ దినేష్ కుమార్.. హైవే పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. బాధితురాలు సహాయం కోసం అరిచినా.. వినేవారు లేకపోవడంతో కామానికి బలైంది. చివరకు క్రిటికల్ కండిషన్‌లో ఉన్న ఆమె హాస్పిటల్‌లో జాయిన్ కాగా కేసు ఫైల్ అయిన పది గంటల్లోనే నిందితుడిని వెతికి పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో పారిపోదామనుకున్న అతని కాలుకు షూట్ చేశారు.
Next Story






