- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మరణించినట్లు ఎస్సై ఎస్. రాజశేఖర్ తెలిపారు.

దిశ, మందమర్రి: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మరణించినట్లు ఎస్సై ఎస్. రాజశేఖర్ తెలిపారు. తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన గోమాస తిరుపతి వయస్సు 29 సంవత్సరాలు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ తన స్నేహితుడైన గువ్వల కిషోర్‌తో కలిసి ప్రయాణికుల కిరాయి నిమిత్తం మంచిర్యాలకు వెళ్లారు. మంగళవారం రాత్రి సమయంలో ఆటోలో తాండూరు కు వస్తుండగా మార్గమధ్యలో మందమర్రి మండలం అందుగులపేట శివారులో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలోకి వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక లారీ వారి ఆటోను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న గోమాస తిరుపతి, గువ్వల కిషోర్‌లకు గాయాలయ్యాయి. తిరుపతికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి కరీంనగర్‌లోని కెల్విన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రోజున మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ సంఘటనపై మృతుని తమ్ముడైన గోమాస రాజ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్. రాజశేఖర్ తెలిపారు.






