అనుమానాస్పదంగా ఆటో డ్రైవర్ మృతి.. అక్రమ సంబంధమే కారణమా?

by Bhoopathi Nagaiah |

అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఎంజీ నగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది.

అనుమానాస్పదంగా ఆటో డ్రైవర్ మృతి..  అక్రమ సంబంధమే కారణమా?
X

దిశ, చివ్వెంల: అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఎంజీ నగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎంజీ నగర్ తండాకు చెందిన రత్నవత్ మణిభార్గవ్ వయస్సు (22) ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం ఆటో తొలడానికి వెళ్లిన రత్నవత్ మణిభార్గవ్ ఎంజీనగర్ తండా నుంచి రోళ్ల బండతండా వెళ్లే దారిలో అనుమానస్పదంగా మృతిచెందాడు. సంఘటన స్థలంలో తాడు, చాకు ఉన్నాయని, మెడ చుట్టు తాడుతో ఉరి వేసిన ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. యువకుడి మృతికి అక్రమ సంబంధమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

రూరల్ సీఐ రాజశేఖర్ పర్యవేక్షణలో చివ్వెంల ఎస్ఐ రత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎంజీ నగర్ తండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సూర్యాపేట రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రత్నవత్ మణిభార్గవ్ మృతిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని తండా ప్రజలు డిమాండ్ చేశారు.

Next Story