- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీసీఎం డ్రైవర్ అజాగ్రత్తతో ఆటో డ్రైవర్ మృతి..
by Taduka Kalyani |
అజాగ్రత్తగా అతివేగంగా డ్రైవర్ డీసీఎంను నడిపిన కారణంగా ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన సంఘటన మోమిన్ పేట్ మండల పరిధి ఎంకతల గ్రామ సమీపంలో జరిగింది.

X
దిశ, మర్పల్లి: అజాగ్రత్తగా అతివేగంగా డ్రైవర్ డీసీఎంను నడిపిన కారణంగా ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన సంఘటన మోమిన్ పేట్ మండల పరిధి ఎంకతల గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మోమిన్ పేట్ మండల పరిధిలోని గోవిందాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ జాహుర్ (57), గోవిందాపూర్ నుంచి గంగారం కు ఆటో నడుకుంటూ వస్తున్న క్రమంలో ఎంకతల గ్రామ పరిధిలో మామిటి తోట వద్ద ఎంకతల గ్రామం వైపు నుంచి ఒక డీసీఎం డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి ఆటోను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో మహమ్మద్ జాహుర్ కు బలమైన గాయాలైనాయి. దీంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించి చికిత్స అందిస్తుండగా మధ్యాహ్నం మహమ్మద్ జాహుర్ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






