అర్ధరాత్రి బాయ్‌ఫ్రెండ్‌ను నరికి చంపిన స్టార్ నటి..

by Sujitha Rachapalli |

టీవీ స్టార్ తమికా సుయాన్-రాస్ చెస్సర్‌ హత్యారోపణలు ఎదుర్కొంటోంది. తన బాయ్ ఫ్రెండ్ జూలియన్‌ను తనే చంపినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆయన శరీరం వికృత

అర్ధరాత్రి బాయ్‌ఫ్రెండ్‌ను నరికి చంపిన స్టార్ నటి..
X

దిశ, వెబ్‌డెస్క్ : టీవీ స్టార్ తమికా సుయాన్-రాస్ చెస్సర్‌ హత్యారోపణలు ఎదుర్కొంటోంది. తన బాయ్ ఫ్రెండ్ జూలియన్‌ను తనే చంపినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆయన శరీరం వికృత రూపంలో తల లేకుండా బాత్రూమ్‌లో కనుగొనబడగా.. ఆ తర్వాత రెండు రోజుల నుంచి ఈ మర్డర్ అలిగేషన్స్ స్టార్ట్ అయ్యాయి. జూన్ 17 అర్ధరాత్రి సమయంలో మర్డర్ చేశాక.. బాడీ నుంచి తలను వేరు చేసి బయటకు తీసుకెళ్లినట్లు నమ్ముతున్నారు పోలీసులు. జూలియన్ తలను గుర్తించిన వారికి బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు.

కాగా హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత.. నలుపు రంగు దుస్తుల్లో తల నుంచి కాలి వరకు పూర్తిగా కప్పుకున్న ఓ మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. ఆ మహిళ కచ్చితంగా టీవీ స్టార్ చెస్సర్ అని నమ్ముతున్నారు. ఇక ఈ మర్డర్ కేసులో డిటెక్టివ్ సూపరిండెంట్ మీడియాతో మాట్లాడుతూ.. “ఈ వార్త జూలియన్ కుటుంబానికి ఎంత బాధ కలిగిస్తుందో నేను ఊహించగలను. మీరు కూడా ఆలోచించండి. జూలియన్ తలను తిరిగి పొందితేనే వారు శాంతియుతంగా అంత్యక్రియలు జరిపి అతనిని విశ్రాంతిలో ఉంచేలా చేయగరు. దీనికి ప్రజలు కూడా సహాయం అందించాలి” అని కోరారు.

Next Story