నీకు తాతనవుతా అంటూ.. బాలికపై 42 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం

by Batti.Sumithra |

వరుసకు తాతైనా వ్వక్తి మైనర్ బాలిక పై లైంగికదాడికి ప్రయత్నించిన ఘటన కుల్కచర్ల మండలం గోరిగడ్డతండాలో చోటుచేసుకుంది.

నీకు తాతనవుతా అంటూ.. బాలికపై 42 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం
X

దిశ, కుల్కచర్ల : వరుసకు తాతైనా వ్వక్తి మైనర్ బాలిక పై లైంగికదాడికి ప్రయత్నించిన ఘటన కుల్కచర్ల మండలం గోరిగడ్డతండాలో చోటుచేసుకుంది. కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల గోరిగడ్డతండాలో (12) ఏళ్ల మైనర్ బాలికపై వరుసకు తాతైన వడిత్యా మోతీలాల్ (42) మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి, డబ్బులు ఇస్తా అని చెప్పి పక్కన ఉన్నా ఇంటి గదిలోనికి తీసుకెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తించి అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు.

దీంతో బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో ఇరుగు, పొరుగు స్థానికులు గమనించి వెంటనే పోలీసు హెల్ప్ లైన్ నంబర్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ ఘటన పై బాలిక తల్లి కుల్కచర్ల పోలీస్ స్టేషన్ లో సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుల్కచర్ల ఎస్సై గిరి Cr no:34/2023, U/sec 354(a) and sec 11 r/w 12 of Pocso act కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి ఘటన పునారావృతం కాకుండా చూడాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Next Story