ఏపీలో దారుణం.. వైసీపీ నేత తల్లిదండ్రులపై దాడి.. తల్లి మృతి

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తిలో వైసీపీ నేత చెవిరెడ్డి మధుసుధన్ రెడ్డి తల్లి దండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. తండ్రి మ‌హాదేవ‌రెడ్డికి సైతం తీవ్ర‌గాయాలు కాగా ప్ర‌స్తుతం ఆయన ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏపీలో దారుణం.. వైసీపీ నేత తల్లిదండ్రులపై దాడి.. తల్లి మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తిలో వైసీపీ నేత చెవిరెడ్డి మధుసుధన్ రెడ్డి తల్లి దండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. తండ్రి మ‌హాదేవ‌రెడ్డికి సైతం తీవ్ర‌గాయాలు కాగా ప్ర‌స్తుతం ఆయన ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. దాడికి పాల్ప‌డింది ఎవ‌రు దొంగ‌తనానికి వ‌చ్చి దాడి చేశారా లేదంటే రాజ‌కీయాల్లో విభేదాల కార‌ణంగా దాడి చేశారా అన్నది తేలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌నపై స‌మాచారం అందిన వెంట‌నే వైసీపీ స్థానిక నేత భూమన క‌రుణాక‌ర్ రెడ్డి తిరుప‌తిలోని మ‌ధుసూధ‌న్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఘ‌ట‌న‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ మొద‌లు పెట్టారు.

Next Story