బీజేపీ ఎంపీ సోదరికి ఘోర అవమానం.. స్నానం చేస్తుండగా చిత్రీకరించిన మామ, బావమరిది.. వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-08 10:43:16  IST  )

బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్ సోదరి రీనా సింగ్‌కు ఘోర అవమానం జరిగింది. ఆమె స్నానం చేస్తుండగా.. మామ, బావమరిది చిత్రీకరించారని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను మామ కర్రతో కొట్టి చంపేస్తానని బెదిరించాడని.. లైసెన్స్డ్ గన్‌తో కాల్చి చంపుతానన్నాడని ఆరోపించింది.

బీజేపీ ఎంపీ సోదరికి ఘోర అవమానం.. స్నానం చేస్తుండగా చిత్రీకరించిన మామ, బావమరిది.. వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్ సోదరి రీనా సింగ్‌కు ఘోర అవమానం జరిగింది. ఆమె స్నానం చేస్తుండగా.. మామ, బావమరిది చిత్రీకరించారని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను మామ కర్రతో కొట్టి చంపేస్తానని బెదిరించాడని.. లైసెన్స్డ్ గన్‌తో కాల్చి చంపుతానన్నాడని ఆరోపించింది. బావ మరిది తనపై పదునైన కత్తి, ఇనుప రాడ్డుతో దాడి చేశాడని, ఇందుకు సంబంధించిన గాయాలను చూపించింది. శారీరకంగా, మానసికంగా హింసించారని ఫిర్యాదు చేయగా.. ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపాడు సహవర్ పీఎస్ ఇంచార్జ్ చమన్ గోస్వామి. దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కర్రతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కూడా. మరోవైపు రీనా సింగ్ అత్తామామలు తమపై దాడి చేసిందని ముందుగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Next Story