నగరం నడిబొడ్డున దారుణం.. చాకలి ఐలమ్మ మునిమనవరాలి దారుణ హత్య

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-24 05:27:40  IST  )

మాన‌వ విలువ‌లు మంట‌క‌లిసిపోతున్నాయి. ప్రేమ పేరుతో అయిన‌వాళ్ల‌నే చంపుకుంటున్నారు. తెలిసీతెలియ‌ని వ‌య‌సులో ప్రేమ‌లో ప‌డి

నగరం నడిబొడ్డున దారుణం.. చాకలి ఐలమ్మ మునిమనవరాలి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. చదువుకోవాల్సిన వయసులో యువత పెడతోవన వెళుతూ కన్నోళ్ల ప్రాణాలను తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో తల్లికూతుళ్లు ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే, 10 తరగతి చదువుతోన్న తేజశ్రీ(16)కి నల్లగొండకు చెందిన పగిల్ల శివ (19) అనే యువకుడితో 8 నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. రాను రాను ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. అయితే, విషయం తల్లి అంజలికి తెలియడంతో చదువుకోవాల్సిన వయసులో ఈ ప్రేమలు ఏంటని ఇద్దరిని మందలించింది. దీంతో తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లి అంజలిని ఎలాగైనా అంతమొందించాలని శివ, తేజశ్రీ ప్లాన్ వేశారు.

సోమవారం సాయంత్రం నల్గొండ నుంచి వచ్చిన ప్రియుడు శివ, తేజశ్రీ ఇంటికి వెళ్లి పూజ చేస్తున్న అంజలిపై వెనుక నుంచి దాడి చేశాడు. అనంతరం బెడ్‌షీట్‌తో అంజలి ముఖాన్ని కప్పగా.. తల్లి అని చూడకుండా కుమార్తె తేజశ్రీ ఆమె తలపై సుత్తితో బలంగా బాదింది. అయినా.. అంజలి ప్రాణం పోకపోవడంతో ఆమె పీకను శివ తమ్ముడు యశ్వంత్‌ కిరాతకంగా కత్తితో కోసేశాడు. స్థానికుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, చనిపోయిన అంజలి ఎవరో కాదు.. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి ఐలమ్మకు స్వయానా మునిమనవరాలు. తేజశ్రీ తల్లి అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్‌గా ఉన్నారు. ఆమె స్వగ్రామం తొర్రూరు దగ్గర ఇనుగుర్తి. కూతురే తల్లిని ఇలా దారుణంగా చంపేయడంతో ఆ కళా బృందంలో సభ్యులంతా ఇప్పుడు షాక్‌లో ఉన్నారు.

Next Story