సికింద్రాబాద్ లో దారుణం..యువకుడిని నరికి చంపిన దుండగులు

by velandi.Saikiran |

సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని దుండగులు నరికి చంపారు.

సికింద్రాబాద్ లో దారుణం..యువకుడిని నరికి చంపిన దుండగులు
X

దిశ‌, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై యువకుడిని ఏకంగా ఆరుగురు దుండగులు నరికి చంపారు. బైక్ లపై వచ్చి యువకుడిని వెంటాడి మరి నిందితులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన జరగగానే ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు.

అయితే, ఆరుగురు దుండగులు చంపి.. పారిపోయిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అప్పటికే ఆ యువకుడు మరణించాడని తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇక‌ ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story