- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జానకీపురంలో దారుణం: కూతుళ్లకు విషమిచ్చిన తండ్రి .. ఒక కూతురు మృతి, మరో కూతురి పరిస్థితి విషమం
by Taduka Kalyani |
జనగామ జిల్లా పాలకుర్తి మండలం జానకిపురంలో సోమవారం దారుణం జరిగింది.

X
దిశ, దేవరుప్పుల(పాలకుర్తి): జనగామ జిల్లా పాలకుర్తి మండలం జానకిపురంలో సోమవారం దారుణం జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు కూతుళ్లకు తండ్రి గుండె శ్రీనివాస్ కూల్ డ్రింక్ లో విషమిచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు కూతుళ్లను ఎంజీఎంకు తరలిస్తుండగా పెద్ద కూతురు ప్రియ(10 )మృతి చెందిందని, చిన్న కూతురు నందిని (7)పరిస్థితి విషమం ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లి ధనలక్ష్మి ఇంట్లో లేని సమయంలో ఇద్దరు కూతుళ్లకు తండ్రి శ్రీను విషమిచ్చినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. కుటుంబ కలహాలే అఘాయిత్యానికి కారణమని సమాచారం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






