దారుణం.. యువకుడి ప్రైవేట్ పార్ట్‌ను కొరికేసిన కుక్క

by Disha Web Desk 6 |
దారుణం.. యువకుడి ప్రైవేట్ పార్ట్‌ను కొరికేసిన కుక్క
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుండి కుక్కల బెడద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పలు ప్రదేశాల్లో ఇప్పటికే చాలా మందిపై కుక్కలు దాడి చేశాయి. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో కుక్కలను చూస్తేనే జనాలు వణికిపోతున్నారు. వివిధ ప్రాంతాల్లో కుక్కలు బెంబెలెత్తిస్తున్నాయి. తాజాగా, హర్యానాలోని కర్నాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని కర్నాల్‌లో పిట్‌బుల్ కుక్క రెచ్చిపోయి 30 ఏళ్ల యువకుడి ప్రైవేట్‌ పార్ట్‌ను కొరికేసింది. దీంతో యువకుడు కుక్క నోటిలో క్లాత్ పెట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయినా లాభం లేకపోయింది. అది గమనించిన స్థానికులు వెంటనే కుక్కను తరిమికొట్టి యువకుడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి చికిత్స చేసిన వైద్యులు యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. పిట్‌బుల్ కుక్క అత్యంత ప్రమాదకరమైనవని వాటితో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed