దారుణం.. కుటుంబంపై ఒక్కసారిగా దాడి ఒకరు మృతి

by Malleboina Mahesh |   (  Updated:2025-08-24 05:22:34  IST  )

సరదగా నవ్వుకుంటూ ఉన్న ఇంటిపై ఓ దుండగుడు విరుచుకుపడి దాడి చేశాడు. ఈ దాడితో ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

దారుణం.. కుటుంబంపై ఒక్కసారిగా దాడి ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సరదగా నవ్వుకుంటూ ఉన్న ఇంటిపై ఓ దుండగుడు విరుచుకుపడి దాడి చేశాడు. ఈ దాడితో ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. నిందితుడిని ఆపేందుకు తండ్రి అడ్డుపడగా.. దుండగుడు అతనిపై తీవ్ర స్థాయిలో దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దారుణమైన సంఘటన యూపీలోని సిద్ధార్థ నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మిశ్రాయులియా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్‌చౌరి గ్రామంలో ఒక వ్యక్తి ఒక కుటుంబంపై నిందితుడు ముఖేష్ అతని స్నేహితులతో కలిసి వెళ్లి దాడికి పాల్పడ్డాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ముఖేష్ కుటుంబ సభ్యుల పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో 45 ఏళ్ల రామ్‌కల అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే తల్లీ, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారి నుంచి వాగ్మూలం తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Read More...

బొల్లాపల్లిలో భర్త హత్యకేసును ఛేదించిన పోలీసులు.. భార్యే కిలాడి

Next Story