కోస్గి బస్టాండులో దారుణం.. బ‌స్సు ఢీ కొని మ‌హిళా మృతి

by Ratna Kumari |

దిశ‌, కోస్గి : కోస్గి బ‌స్టాండ్ లో దారుణం చోటు చేసుకుంది. బ‌స్టాండ్ లో బ‌స్సు ఢీ కొని మ‌హిళా మృతి చెందింది. ఎస్సై బాల‌రాజ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కోస్గి మండ‌లం పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గొల్ల

కోస్గి బస్టాండులో దారుణం.. బ‌స్సు ఢీ కొని మ‌హిళా మృతి
X

దిశ‌, కోస్గి : కోస్గి బ‌స్టాండ్ లో దారుణం చోటు చేసుకుంది. బ‌స్టాండ్ లో బ‌స్సు ఢీ కొని మ‌హిళా మృతి చెందింది. ఎస్సై బాల‌రాజ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కోస్గి మండ‌లం పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గొల్ల చిన్న హ‌నుమ‌య్య‌(60) త‌న ప‌నులు ముగించుకొని గ్రామానికి తిరిగి వెళ్లే స‌మ‌యంలో బ‌స్టాండ్ కి చేరుకుంది. అదే స‌మ‌యంలో బ‌స్టాండ్ లోప‌లికి వ‌స్తున్న నారాయ‌ణ‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు ఆమెకు ఎదురుగా వ‌చ్చింది. దీంతో బ‌స్సు ఆమెను ఢీ కొట్ట‌డంతో వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే ఆమె మృతి చెందింద‌ని ఎస్సై తెలిపారు.

ప్ర‌మాదాల‌కు నిల‌యం కోస్గి బ‌స్టాండ్

ఎంతో విశాలంగా ఉన్న కోస్గి బస్టాండ్ ను వ్యాపారాలు నిర్వహించినందుకు నారయ‌ణ‌పేట డిపో కు చెందిన అధికారులు ఇష్టారాజ్యంగా డబ్బాలు నిర్మించుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో బస్సులు తిరగలేని స్థితికి చేరుకుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్టాండుకు లోపలికి వచ్చే బస్సులు బయటకు వెళ్లేందుకు ఒకటే దారిని ఏర్పాటు చేయడంతో వచ్చి వెళ్లే బస్సుల ఇబ్బందులు ఒకటైతే ప్రయాణికుల సైతం ఇదే రహదారి గుండా లోపలికి వచ్చేందుకు రహదారి ఉండడంతో నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుమార్లు చిన్న చిన్న సంఘటనలు జరిగిన అధికారులు పట్టించుకోవడంలేదని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేసి బస్టాండ్ లో నెలకొన్న ప్రమాద కరమైన డబ్బాలను తొలగించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Next Story